
నల్లకుభేరులకు , అవినీతి పరులకు ప్రధాని మోడీ హెచ్చరికలు చేశారు. ప్రధాని మోడీ 2014 ఎన్నికల వేళ దేశ ప్రజలకు ప్రధానంగా ఒక్కటే హామీ ఇచ్చారు. అది నల్లకుభేరుల నుంచి డబ్బును తీసుకొచ్చి దేశ ప్రజలందరికీ పంచుతానని చెప్పాడు. దీనికి అప్పట్లో చాలా చప్పట్లు , ప్రశంసలు లభించాయి. కానీ ఇప్పుడు ప్రధానిగా రెండేళ్లు పూర్తయినా కూడా ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదు.. ప్రధాని నరేంద్రమోడీ జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బ్లాక్ మనీ విషయంలో మరోసారి మోడీ హామీ ఇచ్చారు. ఆర్థిక నేరగాళ్లు, ఉద్దేశపూర్వకంగా ఎగవేత దారులకు చట్టమంటే ఏంటో చూపిస్తా.. వాళ్లను లోపల వేస్తానని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ మంచోడేనని.. ఆయన దేశభక్తుడేనని మోడీ ప్రశంసించారు. కాగా బ్లాక్ మనీ విషయంలో మోడీ మరోసారి హామీ ఇవ్వడంతో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికైనా దీన్ని నెరవేరిస్తే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు..