
తెలంగాణలోని ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ బాంబు పేల్చాడు.. టీఆర్ఎస్ మంత్రులు కొందరు బీజేపీలో చేరబోతున్నారంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే ఎవరు చేరుతున్నది కేంద్రంలోనా.. తెలంగాణలో రాష్ట్ర స్థాయిలోనా అన్నది మాత్రం నిర్ధారణగా చెప్పలేదు.. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు మీరందరూ అంటూ హైదరాబాద్ లో పత్రికలు, టీవీ చానల్స్ ప్రతినిధులతో అనేసి జారుకున్నారు.. దీనిపై టీఆర్ఎస్ పార్టీలో ఒకటే షేక్ నడుస్తోంది. ఎవరెవరు చేరుతున్నారనే దానిపై అప్పుడే ఊహాగానాలు వెలువడుతున్నాయి. నాయిని నర్సింహారెడ్డిని మంత్రివర్గంలోంచి తీసేసి పార్టీ పగ్గాలు అప్పగించేస్తారని ప్రచారం జరిగింది. బహుశా ఆయనే టీఆర్ఎస్ లోంచి బీజేపీలోకి మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది..