బిత్తిరి సత్తి ఆగ్రహించిన వేళ..

టైమ్స్ నౌ జాతీయ చానల్ లో చర్చలను చేసే అర్ణబ్ గోస్వామి అంటే అందరు రాజకీయ నాయకులకు హడలే.. ఆయన చర్చలో పాల్గొనాలంటే అందరి లాగులు తడిసిపోతాయి. అంతలా ఇతరులను ప్రశ్నించి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. ఆ మధ్య పార్లమెంటులో పెప్పెర్ స్ప్రే చేసిన ఎంపీ లాగడపాటి రాజగోపాల్ ను పార్లమెంట్ రౌడీ అంటూ టీవీ చర్చలో ప్రస్తావించి సంచలనం సృష్టించాడు అర్ణబ్ గోస్వామి.. అనంతరం కేసీఆర్ జర్నలిస్టుల మెడలు విరిచేస్తానని వరంగల్ అన్నప్పుడు హిట్లర్ కేసీఆర్ అంటూ ఆయన కూతురు కవిత, కరీంనగర్ ఎంపీ వినోద్ ను కడిగిపారేశారు..

కాగా అర్ణబ్ గోస్వామి మోనార్క్ టైపు.. ఆయన అడిగిందే ప్రశ్న. మనం చెప్పేది వినడు.. ఇప్పుడు ఆయనపై పేరడి చేశాడు సత్తి. వీ6లో ప్రసారమయ్యే బిత్తిరి సత్తి తీన్మార్ లో అర్ణబ్ పై మాంచి సెటైర్ వేసి నవ్వులు పూయించాడు సత్తి.. మీరూ చూసి నవ్వుకోండి ఆ వీడియోను.. పైన

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *