బేతాళుడిగా బిచ్చగాడు..

బిచ్చగాడు మూవీతో సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేసిన విజయ్ అంటోని ఇప్పుడు బేతాళుడిగా వస్తున్నాడు. బిచ్చగాడు వంటి గ్రాండ్ హిట్ తో సౌత్ లో మంచి పేరు సంపాదించుకున్న ఈ విజయ్ ఇప్పుడో మరో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సైతాన్ గా .. తెలుగులో బేతాళుడిగా వస్తున్న ఈ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ అదిరిపోయింది. పాములు చుట్టుమట్టి విజయ్ అంటోని ఉన్న ఈ చిత్రం పోస్టర్ ఆకట్టుకుంటోంది..
కాగా తెలుగులో 40లక్షలకు కొన్న బిచ్చగాడు మూవీ దాదాపు 25కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ రాబోయే బేతాళుడు మూవీపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో విడుదలయ్యే ఈ బేతాళుడు సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కోట్లు పెట్టి కొంటామని ఆఫర్లు వస్తున్నాయట.. సో అదీ లెక్క..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *