
బెంగళూరులో ఓ నైజీరియన్ యువతి నానా హంగామా సృష్టించింది. ఓ షాపింగ్ మాల్ లో చొరబడి వస్తువులను నేలకోసి అక్కడి వస్తువులను నేలకోసి కొడుతూ కస్టమర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. మహిళా కానిస్టేబుల్స్ సైతం ఆమెను కంట్రోల్ చేయలేకపోయారు. ఆమె ఆగడాలు మితిమీరడంతో చివరకు ఓ చద్దరిని తీసుకొచ్చి ఆమెపై చల్లి దొంగచాటుగా పట్టుకొని బంధించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆమె డ్రగ్స్ తీసుకొని ఇలా చేసిందనే అనుమానిస్తున్నారు.