ఆన్ లైన్ మీడియాదే అగ్రస్థానం

k-satya

తాజా సమాచారాన్ని వీక్షకులకు అందించడంలో ఆన్ లైన్ మీడియాదే అగ్రస్థానమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యుడు కే. సత్యనారాయణ అన్నారు. సమాచార రంగంలో పత్రికలు కొంతకాలం, ఎలక్ట్రానిక్ మీడియా మరికొంత కాలం ఆధిపత్యాన్ని కొనసాగిస్తే భవిష్యత్ లో  ఈ రంగంలో ఆన్ లైన్ మీడియానే అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అయిలు రమేశ్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాదిరిగానే ఆన్ లైన్ మీడియాలోని జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేసేందుకు ఐజేయూ, టీయూడబ్ల్యూజే పక్షాన కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మాట్లాడుతున్న తాడూరి కరుణాకర్

మాట్లాడుతున్న తాడూరి కరుణాకర్

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పరిధిలో లేకున్నప్పటికీ ఐజేయూ టీయూడబ్ల్యూజే చొరవతో మీడియాలోని జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు,హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పధకాలు పొందుతున్నారన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆరు దశాబ్దాలుగా టీయూడబ్ల్యూజే ఆవిరాళంగా కృషి చేస్తోందన్నారు. టీయూడబ్ల్యూజేతో మాత్రమే ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. తెలంగాణలో సుమారు 10వేల మంది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీయూడబ్ల్యూజే కు అనుబంధంగా ఏర్పడిన తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా మరింత క్రీయాశీలం కావాలని కోరారు. ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు హెల్త్ కార్డులు, నివేశన స్థలాలు కేటాయించాలని డిమాండ్లను టీయూడబ్ల్యూజే ఎజెండాలో పొందుపరుస్తామన్నారు.

మాట్లాడుతున్న అయిలు రమేశ్

మాట్లాడుతున్న అయిలు రమేశ్

తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు వెల్పేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ మాట్లాడుతూ ఇటీవల తమ సంఘం లోగోను ఆవిష్కరించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆన్ లైన్ మీడియాను అప్ కమింగ్ మీడియా అని.. అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంలో ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు కొందరికి అక్రిడిటేషన్లు జారీ అయ్యాయని.. మిగిలిన వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆన్ లైన్ మీడియాలో జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేస్తున్న ఆన్ లైన్ మీడియా భవిష్యత్తులో ఈ రంగంలో మరింత వృద్ది సాధించగలరన్నారు.

సభ్యత్వాలను అందజేస్తున్న దృశ్యం

సభ్యత్వాలను అందజేస్తున్న దృశ్యం

ఈ సందర్భంగా టోమ్జా సభ్యత్వాలను జర్నలిస్టులకు అతిథులు అందజేశారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ చేతుల మీదుగా ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు కనకదుర్గ, వేముల సదానదం, తొలి సభ్యత్వాలను అందుకున్నారు. టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్టు డా. రామ్మూర్తి , తాడూరి కరుణాకర్ చేతుల మీదుగా ఎస్ నాగరాజ కుమారి , రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ చేతుల మీదుగా రేఖారాణి రాష్ట్ర ప్రధాన కార్యదర్వి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుదాసు సభ్యత్వ పత్రాలను అందుకున్నారు.

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయకార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ,తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు(టోమ్జా) అయిలు రమేశ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, టోమ్జా ప్రధాన కార్యదర్శులు కళ్యాణం శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల సదానందం, కనకదుర్గ, రాష్ట్ర కార్యదర్శులు ఏ. రాజేశ్, ప్రభుదాసు, డా.రాంమూర్తి, కోశాధికారి రేఖారాణి, కార్యవర్గ సభ్యులు శంకర్ గౌడ్, నాగరాజ కుమారి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. సంపత్ కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *