
ముస్లిం దేశం బంగ్లాదేశ్ లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ఆ దేశంలో 90శాతం మంది ముస్లిం జనాభానే ఉంది. కేవలం 10శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. ముస్లిం అతివాద దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోంది.. మన పక్కదేశం బంగ్లాదేశ్ లో రోజురోజుకు ఐసిస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ని ఓ ఖరీదైన రెస్టారెంట్ లో ఉగ్రవాదులు దారుణ మారణకాండను సృష్టించారు. అందులో ఉన్న 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి దారుణంగా చంపారు.
ఈ ఘటనలో 19ఏళ్ల భారతీయ యువతి కూడా ఉండడం గమనార్హం. ఉగ్రవాదులు ఖురాన్ ను పంటించిన భారతీయ వైద్యుడు సహా చాలా మందిని వదిలేశారు. ఖురాన్ ను పాటించని వారిని గొంతును దారుణంగా కోశారు.. ఈ ఘటన జరిగిన 10 గంటల తర్వాత బంగ్లా సైన్యం ఉగ్రవాదులను హతమార్చింది. అప్పటికే 20 మంది చనిపోయారు. ఇందులో జపాన్, ఇటలీ దేశస్థులు ఉన్నారు.