
ప్రముఖ హీరో బాలక్రిష్ణకు పెనుముప్పు తప్పింది. ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ కాన్వాయ్ లోని కారు యాక్సిడెంట్ కు గురైంది. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లిలో ఈ ఘటన జరిగింది.. బాలక్రిష్ణ అప్పుడు కారులోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.