జాతీయ అవార్డుల్లో దుమ్ము దులిపిన ఘాజీ, బాహుబలి..

baahubali-2

65వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమా బాహుబలి2, ఘాజీ సత్తా చాటాయి.. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో బాహుబలి2 అవార్డులను గెలుచుకుంది. అలాగే వినోదాత్మక సినిమాగా కూడా అవార్డును పొందింది.

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘాజీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రంగా ‘న్యూటన్’ నిలిచిన ఈ అవార్డుల కమిటీ అధ్యక్షుడు శేఖర్ కపూర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు..

కాగా జాతీయ ఉత్తమ చిత్రంగా అస్సామీ భాషలో తీసిన ‘విలేజ్ రాక్ స్టార్స్’ నిలిచింది. అలాగే జాతీయ ఉత్తమ నటిగా ఇటీవలే మరణించిన శ్రీదేవి నిలిచింది. ‘మామ్’ సినిమాలో నటనకు గాను శ్రీదేవికి ఈ అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ దర్శకుడిగా నాగరాజ్ మంజులేకు అవార్డు వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా రెహమాన్ నిలిచాడు. జాతీయ ఉత్తమ నటుడిగా రిద్దిసేన్ బెంగాలీ సినిమా నాగర్ కీర్తన్ కు గాను వరించింది.

65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈ మే 3న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందజేస్తారు. బాహుబలి2కి మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగంలో అవార్డులు దక్కాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.