
చంద్రబాబు అంటే నే పబ్లిసిటీ మ్యాన్ అనే అపవాదు ఉంది. కొంచెం చేసి చాలా ప్రచారం చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించి అంతకు రెట్టింపు ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు ఏపీని సింగపూర్ చేస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. అదే కోవలో ప్రచారానికి పనికి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోరు మన సీఎం చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబు.. విశాఖలో ఈరోజు ప్రారంభం కానున్న ఇంగ్లాండ్-ఇండియా తొలిటెస్ట్ ను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ టెస్ట్ కోసం విశాఖకు వచ్చిన అగ్రశ్రేణి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, భారత సెలక్షన్ కమిటీ చైర్మన్, తెలుగు క్రీడాకారుడు అయిన ఎంఎస్కే ప్రసాద్ ను క్రికెట్ స్టేడియంలో ఘనంగా సన్మానించారు. ఇందంతా నేషనల్ చానల్ స్టార్ స్పోర్ట్స్ లో రావడంతో బాబు సన్మానం.. ఘనత విశ్వవ్యాప్తంగా అయ్యింది. నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేసింది. దీంతో అటు ప్రచారానికి ప్రచారం.. ఇటు స్వకార్యం, అటు స్వామి కార్యం పూర్తయ్యినట్టు అయ్యింది.