Breaking News

బాహుబలి టీం వద్ద రూ. 55 కోట్ల బ్లాక్ మనీ..

e1b07bc2-ca15-44d3-a1b3-da056e6d668f

బాహుబలి.. మోడీ దెబ్బకు బలైపోయింది. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ పన్నుల విషయంలో ఖర్చులు ఎక్కువ చూపినట్టు లెక్కలు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, 1000 నోట్ల రద్దుతో గుట్టులుగా పేరుకుపోయిన డబ్బును ఇప్పుడు ఐటీశాఖ స్వాధీనం చేసుకునే పపనిలో పడింది.
ఆపరేషన్ బాహుబలి నిర్వహించారు ఐటీశాఖ అధికారులు.. బాహుబలి ముంబై హక్కులు పొందిన ముంబైకి చెందిన అగర్వాల్ అనే పారిశ్రామిక వేత్త , సినిమా పంపిణీ దారుడు ఐటీ శాఖ వలలో చిక్కుకున్నాడు. పక్కా స్కెచ్ తో హైదరాబాద్ లోని బాహుబలి నిర్మాతలు శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్ కార్యాలయాలు సహా హైదరాబాద్ లో ఆరు చోట్ల, ముంబై, బెంగళూరుల్లో 9 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు దాదాపు 55కోట్ల నల్లధనం బయటపడినట్లు సమాచారం. కాగా అదంతా సినిమా డబ్బేనని.. తమ లెక్కలు, పత్రాలు పక్కాగా ఉన్నాయని బాహుబలి టీం తెలిపినట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *