ఆస్కార్ కు రుద్రమదేవి..

కాకతీయ సామ్రాజ్యాన్ని తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రదారి. రానా, అల్లు అర్జున్ ఇతర పాత్రలు పోషించారు. దాదాపు 70 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ కాకతీయ సామ్రాజ్యపు చిత్రం రుద్రమ దేవి.. ఇప్పుడు అస్కార్ బరిలోకి దూకింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో రుద్రమదేవి చిత్రాన్ని నామినేట్ చేసింది. రుద్రమదేవితో పాటు పలు ప్రాంతీయ చిత్రాలను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా గుణశేఖర్ పేర్కొనడం గమనార్హం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *