Breaking News

ఒక ప్రాణం ఖరీదు 30 లక్షలు..

asi mohan reddy

ఏఏస్సై మోహన్ రెడ్డి దురాగతానికి మరో ప్రాణం బలి అయ్యింది.. ఏఏస్ ఐ దగ్గర తన భూమి కుదవ పెట్టిన పాపానికి ప్రాణాన్నే కోల్పోయాడు బాధితుడు.. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తన రెండెకరాల భూమి హక్కు పత్రాలను దందా నిర్వహిస్తున్న ఏఏస్ఐ మోహన్ రెడ్డి వద్ద పెట్టి దాదాపు 2 లక్షలు అప్పు చేశాడు. అనంతరం కొద్దికాలానికి తిరిగి డబ్బు చెల్లించినా ఏఎస్ఐ భూమి పత్రాలు ఇవ్వలేదు. దీంతో బాధితుడు నారాయణ రెడ్డి చాలా ఆందోళనలు నిర్వహించారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా, కోర్టులో ఫిర్యాదు చేసినా ఆ కేసు వెనక్కి తీసుకోలేదు. దీంతో చివరకు తన భూమి తిరిగివ్వడం లేదని మనస్తాపంతో నిన్న రాత్రి సూసైడ్ నోట్ రాసి తన చావుకు ఏఏస్ఐ మోహన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డిలే కారణమని ఆత్మహత్య చేసుకున్నాడు..
అనంతరం నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాకు జరిగిన విషయం తెలపడంతో ఈ ఉందంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన ఏఏస్ఐ మోహన్ రెడ్డి లాబీ .. ఒక పోలీస్ ఉన్నతాధికారి బాధితులను రప్పించుకొని నారాయణ రెడ్డి చావుకు వెలకట్టాడు.. దాదాపు 30 లక్షలు, భూమి పత్రాలు ఇస్తామని చెప్పడంతో నారాయణరెడ్డి కూతురు ఒప్పుకొని కేసును వాపస్ తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె సొంత గ్రామమైన గుండ్లపల్లి వాసులు స్వయంగా తెలిపారు. డబ్బులైన వస్తాయి.. తండ్రి చనిపోయాడు కదా పేదరికపు కుటుంబానికి ఆసరా అవుతాయని నారాయణ రెడ్డి చావును మొత్తానికి మూసివేశారు..
అనంతరం కరీంనగర్ ప్రెస్ భవన్ లో విలేకరుల సమావేశం పెట్టి తన తండ్రి నారాయణ రెడ్డి కడుపునొప్పి తో చచ్చాడు.. ఏఏస్ఐ మోహన్ రెడ్డి వల్ల కాదు అని స్టేట్ మెంట్ ఇచ్చింది..
కాకీల దురాగతానికి మరో ప్రాణం పోయింది. బాధితుడి చచ్చాక 30 లక్షలు ఇచ్చిన ఖాకీలు అదే బతికున్నప్పుడు ఆయన స్థలం పత్రాలు ఇస్తే ఒక ప్రాణం నిలిచి ఉండేది.. ఇంకా ఎంతో మంది బాధితులు తమ ఆస్తుల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. వారి చావులు చూడకముందే ఏఏస్ఐ వారి ఆస్తులను తిరిగిచ్చేయాలని పలువురు కోరుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *