
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. వారు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కాగా ఈ ఉగ్రవాదులకు న్యాయం సహాయం చేసి విడిపిస్తానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ముస్లింలేనని.. పేదరికంతో అలా అయ్యారని.. వారిని విడిపిస్తామని అసదుద్దీన్ అనడం పై బీజేపీ సహా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఏకంగా కొందరు అసదుద్దీన్ పై కేసులు నమోదు చేశారు. ప్రజలను బాంబులు పెట్టి చంపేస్తానన్న తీవ్రవాదులతో ఎంపీ ఇలా అంటకాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.