గవర్నర్ గిరీ.. పోయిందే..

arunachal-pradesh_gov_twitter-kalrajmishra380

పదవీ కాంక్షతో ఓ గవర్నర్ తన సీటును ఖాళీ చేయనని మొరాయించాడు.. దీంతో కేంద్రమే ఆ పని చేసింది.. అరుణాచల్ ప్రధేశ్ గవర్నర్ రాజ్ కోవా పదవి నుంచి తప్పుకోవడానికి తిరస్కరిస్తే కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోబానికి రాజ్ కోవా ఆజ్యం పోయడం, అందులో సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, కేంద్రం పరువు పోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పుకోవాలని కేంద్రం సూచించింది. తనను తప్పుకోవాలని కేంద్రం కోరిందని, కానీ తాను రాజీనామా చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. కావాలంటే రాష్ట్రపతి తొలగించవచ్చని తెలిపారు. దాంతో ప్రభుత్వం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథం కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *