మోడీని షేక్ చేయని అర్ణబ్ గోస్వామి

అర్ణబ్ గోస్వామి.. టౌమ్స్ నౌ అనే జాతీయ చానల్ లో డిబేట్ లు నిర్వహించే ప్రముఖ జర్నలిస్ట్.. ఈ యన డిబేట్లో పాల్గొనాలనుకునేవారిని కడిగిపారేస్తారు. పార్లమెంటు లో తెలంగాణ బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే చల్లిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను పార్లమెంటు రౌడీ అంటూ సంభోందించి సంచలనం సృష్టించాడు. జర్నలిస్టులను మెడలు విరిచి 2 కి.మీల లోతులా పాతిపెడతానన్న కేసీఆర్ ను రాక్షసుడివంటూ మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కవితను వాళ్ల నాన్న అన్న మాటలకు ఆమె చేత సారీ చెప్పించారు. ఇంత వాగ్ధాటి ఉన్న అర్ణబ్ గోస్వామి.. ఒక విషయంలో ఫెయిల్ అయ్యాడు..

ప్రధాని మోడీ తొలిసారి దూరదర్శన్ కు కాకుండా ప్రైవేట్ చానల్ అయిన టౌమ్స్ నౌకు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ ఇంటర్వ్యూను దేశప్రజలందరూ ఆసక్తిగా చూశారు. అర్ణబ్ ప్రధాని మోడీని ఏకిపారేస్తారని ఆశించారు. కానీ అర్ణబ్ తన సహజ శైలికి దూరంగా చాలా సాఫ్ట్ గా ఇంటర్వ్యూను ముగించాడు. ఈ ప్రొగ్రాం ముగిసిన తర్వాత వివిధ వర్గాలు, మేధావులు, ప్రజల నుంచి టౌమ్స్ నౌ ఆఫీసుకు, ఎండీకి ఫోన్లు వచ్చాయట.. అర్ణబ్ మోడీని సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదని.. ఫెయిల్ అయ్యాడని ఆరోపించారట.. సో అందరి చేత మూడు చెరువుల నీళ్తు తాగించిన జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి.. మోడీని మాత్రం ఏం చేయలేకపోయాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *