Breaking News

మాట ఇచ్చి మార్చడం మీ జాగీరా: ఆరేపల్లి

arepally

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్ మాట మార్చడం ఆయన జాగీరా ఇది అని విమర్శించారు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్.. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, వంటావార్పు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ పేరు బ్రాండ్ పేరుతో ఆటలాడుతున్న కేసీఆర్ కు జర్నలిస్టుల సమస్యలు తెలియవా అని ప్రశ్నించారు. రెండేళ్లవుతున్న అక్రిడిటేషన్లపై తెలంగాణ ప్రభుత్వం అని ముద్రించి కార్డు ఇవ్వకుండా కేసీఆర్ సతాయిస్తున్నాడని మోహన్ ఆరోపించారు. వందల ఎకరాల్లో జర్నలిస్టులకు హైదరాబాద్ లో ఇళ్లు కట్టిస్తానన్న కేసీఆర్ అనంతరం రెండేళ్లవుతున్నా ఇవ్వలేదన్నారు. మీడియా యాజమాన్యాలనే బెదిరిస్తున్న కేసీఆర్ జర్నలిస్టులను సైతం బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. మీడియాను మేనేజ్ చేస్తూ అన్యాయాలను అక్రమాలను దాచిపెడుతున్నాడని మండిపడ్డారు. పత్రిక సోదరుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని  ఆరేపల్లి స్పష్టం చేశారు. వెంటనే కేసీఆర్ పత్రికా సోదరుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అద్యక్షులు తాడూరి కరుణాకార్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ , జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్లల రాజేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, సురేంద్రకుమార్, లాయక్ పాషా, కే. భద్రాచలం, ప్రభుదాసు, విజయేందర్ రెడ్డి, వంశీ, జగన్మోహన్, కొండా లక్ష్మన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు , ప్రజాప్రతినిధులు చాడ వెంకట్ రెడ్డి, కటకం మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, విజయరమణరావు, బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్ రావు, గందె మాధవి, సుజాతరెడ్డి, ఆకుల ప్రకాష్, సుదర్శన్, కొరివి వేణుగోపాల్, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *