Breaking News

అందరూ కలిసి వాళ్ల నోట్లో మట్టికొట్టారు..

modi-ap-special-status

ఏపీ ప్రజలను చూస్తే జాలేస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాన్ లు ప్రజలకు న్యాయం చేస్తామని.. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. వివిధ సభల్లో మేమేం ఉద్దరిస్తామని ప్రసంగించారు. కానీ ఏమైంది. రెండేళ్లుగా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఫలితం శూన్యం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రత్యేక హోదా బిల్లును పార్లమెంటులో తెచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం దీనిపై సమాధానమిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చేశారు.  దీంతో ఏపీ నోట్లో పార్లమెంటు సాక్షిగా బీజేపీ మట్టికొట్టినట్టైంది.

ఇప్పుడు ప్రత్యేక హోదా రాదని తెలిసి ఏపీ భగ్గు మంది. ప్రజలు , ప్రతిపక్షాలు వైసీపీ, కాంగ్రెస్ లు ఈరోజు ఏపీ బంద్ ను పిలుపునిచ్చాయి. ప్రజలు, నాయకులు  రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రజలు స్వచ్చందంగా దుకాణాలు , పెట్రోల్ బంక్ లు, థియేటర్లు బంద్ పెట్టారు. ఇక పార్లమెంటులో టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు నినాదాలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ఎటూ తేల్చడం లేదు. దీంతో వారి అన్యాయం ఆక్రందనలు మిన్నంటుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *