‘దమ్మున్న జర్నలిస్టు’ అనిల్ అనిపించుకున్నాడు..

  • శ‌భాష్ అనిల్ కుమార్‌గౌడ్‌…

ఎంసెట్-2 లీకేజీ వ్య‌వ‌హరాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం ద్వారా కొంత మంది విద్యార్ధుల‌కు న‌ష్టం జ‌రిగి ఉండ‌వ‌చ్చు.  ప్ర‌తిభావంతులైన విద్యార్ధులు ఎప్ప‌టికైన బాగానే రాణిస్తారు. ఈ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు కాకుంటే అనేక మంది న‌కిలీ డాక్ల‌ర్లు మాత్ర‌మే స‌మాజంలో ఉండేవారు. ఈ లీకేజీ వ్య‌వ‌హారం వెలుగులోకి తీసుకురావ‌డం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విధిత‌మే. ఈ వార్త‌ను ధైర్యంగా వెలుగులోకి తేవ‌డం ద్వారా ఓరుగ‌ల్లు బిడ్డ క‌క్కెర్ల అనిల్‌కుమార్‌గౌడ్ త‌న‌దైన సాహ‌సాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో త‌న క‌లం ద్వారా అవినీతి అక్ర‌మార్కుల బండారాన్ని ధైర్యంగా బ‌య‌ట‌పెట్ట‌గ‌లిగారు. అది వాస్త‌వ‌రూపం దాల్చ‌కుంటే ప‌రిణామాలు మ‌రో ర‌కంగా ఉండేవ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఎంసెట్‌-2 లీకేజీ వ్య‌వ‌హారాన్ని అత్యంత చాక‌చ‌క్యంగా వెలుగులోకి తీసుకువ‌చ్చి వాస్త‌వ‌రూపం దాల్చే విధంగా క‌ధ‌నం రాయ‌డం… ప్ర‌భుత్వం స్పందించ‌డం… ఎంసెట్‌-2ను ర‌ద్దు చేయ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. శ‌భాష్ అనిల్ కుమార్‌గౌడ్‌…. వ‌రంగ‌ల్‌కు చెందిన అనిల్‌కుమార్‌గౌడ్ గ‌తంలో ప‌లు ప‌త్రిక‌లు, ఛానెల్‌ల‌లో ప‌ని చేసి అనేక విష‌యాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చారు. ప్ర‌భుత్వం ఇలాంటి పాత్రికేయుల‌ను అండ‌గా నిల‌బ‌డి మ‌రింత ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌ర‌ముంది….

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *