Breaking News

పవన్ హీరోయిన్ లూజ్ టాకింగ్

maxresdefault

బాలీవుడ్ హీరోయిన్ అమీష్ పటేల్ నోరుజారింది.. తనను ఏకవ్యాఖ్యంతో సంభోదించిన విలేకరులను చెడుగుడు ఆడింది. తనను గౌరవంగా పిలవాలని కోరింది. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘బద్రీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్‌ హీరోయిన్‌ అమీషా పటేల్‌. ఆ సినిమా మంచి విజయం సాధించినా ఎందుకనో అమీషాను టాలీవుడ్‌ పట్టించుకోలేదు. తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేదు. బాలీవుడ్‌లో కూడా ఆమె పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి ఆమె ఆటిట్యూడే కారణమట.

సినిమాల్లో హీరోయిన్‌గా నటించేటపుడు చాలా ఇగోయిస్ట్‌గా ఉండేదట. అప్పుడే కాదు.. ఇప్పుడు 41 ఏళ్ల వయసులోనూ ఆమె ఇగో ఏమాత్రమూ తగ్గలేదనడానికి తాజా ఉదంతమే ఉదాహరణ. ఇటీవల తను నిర్మాతగా తీస్తున్న సినిమా ప్రెస్‌మీట్‌ కోసం విలేకరుల సమావేశానికి హాజరైంది అమీషా పటేల్‌. ఆ ప్రెస్‌మీట్‌లో ‘అమీషా.. మూడేళ్లుగా ఎందుకు సినిమాల్లో నటించడం లేద’ని ఓ విలేకరి అడిగాడు. ‘నన్ను అమీషా కాదు.. అమీషాజీ అని పిలవండ’ని ఆ విలేకరి మీద అరిచేసిందట. అమీషానే కాదు అమితాబ్‌ను కూడా ఏకవచనంతోనే సంబోధిస్తారనే విషయం తెలిసిందే. వారు కూడా అలా పిలిస్తేనే హ్యాపీగా ఫీలవుతారు. దీంతో అమీషాకు ఎంత పొగరు అనుకున్నారట ఆ సమావేశానికి హాజరైన జర్నలిస్టు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *