పవన్ x అల్లు అర్జున్ కు ఏమైంది..?

మెగా ఫ్యామిలీలో విభేధాలు మరోసారి బయటపడ్డాయి.. సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా సింగపూర్ లో జరిగిన సైమా సినిమా వేడులకల్లో రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రకు గాను అల్లు అర్జున్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. పవర్ స్టార్ అంటూ అభిమానులు కేకలు వేశారు. దీనికి సీరియస్ అయిన అల్లు అర్జున్ వేదికమీదే.. ‘హే గమ్మునుండవోయ్’ వారిపై రుసరుసలాడారు. ఇదివరకు కూడా పవన్ అభిమానుల వల్ల మెగా స్టార్ కుటుంబానికి చెందిన హీరోలు.. ఇతర హీరోలు సైతం ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు..

ఇతర సినిమాల హీరోల ఫంక్షన్లల్లో కూడా పవన్ అభిమానులు అల్లరి చేస్తున్నారని.. ఇది మంచిది కాదని పవన్ పై, ఆయన అభిమానులపై మండిపడ్డారు అల్లు అర్జున్. ఈ వివాదంతో అల్లు అర్జున్ పై పవన్ అభిమానులు దుమ్మెత్తి పోశారు. సోషల్ మీడియాలో రగడ కొనసాగుతుండగానే.. తాజాగా నిన్న జరిగిన సౌమా వేడుకల్లో సైతం అల్లు అర్జున్ మరోసారి పవన్ ను, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం వివాదం రేపినట్టైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *