Breaking News

తెలంగాణ పత్రికల్లో ఆ భాషే వాడాలి..

Allam-Narayana

తెలంగాణ సాధించుకొని రెండున్నరేళ్లు అయినా.. ఇంకా తెలంగాణ మాండళిక, యాస భాషను ఇక్కడి పత్రికలు అలవర్చుకోకపోవడం బాధాకమరి ప్రెస్ అకాడమీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు పత్రికలు-ప్రసార మధ్యమాల భాషా స్వరూపంపై నిర్వహించిన రెండు రోజుల సదస్సులో అల్లం నారాయణ కీలక ఉపన్యాసం చేశారు..

నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఈ ప్రాంత భాష, సంస్కృతి వివక్షకు గురైందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.  1970 తర్వాత సినిమాల్లో తెలంగాణ భాష వివక్షకు గురైందన్నారు. రాష్ట్రం సాధించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల మాండలికాలను స్వీకరించి ఒక భాష విధానాన్ని రూపొందించాలని సూచించారు. తెలంగాణ భాషను పత్రికలు, చానాళ్లు వాడినప్పుడు మన భాషకు గౌరవం దక్కుతందని నారాయణ స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *