అల్లం నారాయణ పదవీకాలాన్ని పెంచిన కేసీఆర్

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో ఆయన పాలకవర్గం పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు అల్లం మరో మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.అల్లం నారాయణ తెలంగాణ ఏర్పడ్డాకా 2014 జూలై 14న ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన నమస్తే తెలంగాణ చీఫ్ ఎడిటర్ గా కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు సంఘాల్లో కీలక భూమిక పోషించి తెలంగాణ కోసం పోరాడారు.

కాగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు పాలవర్గ పదవీకాలన్ని మూడేళ్ల పాటు పొడించిడం పట్ల టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్ ఇతర నేతలు బుధవారం సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *