
బాహుబాలి.. బాహుబలి.. రిలీజ్ కు ముందు ఏమో అనుకున్నాం.. కానీ రిలీజ్ అయ్యాక తెలిసింది.. అదో ప్రపంచ సంచలన చలనచిత్రమని.. తెలుగులో మొదలుపెట్టి దేశవ్యాప్తానికి విస్తరించి.. ప్రపంచాన్ని అబ్బురపరిచిన చిత్రం బాహుబలి.. అదీ మన తెలుగువాడు రూపొందించిన తెలుగు నటులే హీరోలుగా కొనసాగడం మన అదృష్టం..
ఇంతకీ విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించిన బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2 గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను దర్శకుడు రాజమౌళి మీడియాతో పంచుకున్నారు. ఈ అక్టోబర్ నెల బాహుబలి 2 గురించి పలు మేకింగ్ వీడియోలు, ప్రభాస్ గురించి ఒక గొప్న న్యూస్, కామిక్స్ బుక్స్, కార్టూన్ సిరీస్ మొదలుపెడుతున్నట్టు రాజమౌళి ప్రకటించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. దాదాపు 3 ఏళ్లు ప్రభాస్ , రానా, అనుష్క,తమన్నాలను బాహుబలి కోసం అరెస్ట్ చేసిన రాజమౌళి వాళ్ల రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ తో బాహుబలి2 సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని.. అప్పుడే వారిని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ మూడేళ్ల నిరీక్షణ ఫలిస్తోంది.. రాజమౌళి కష్టం బాహుబలి 2 రిలీజ్ ను వచ్చే వేసవి ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
బాహుబలి 2 కు సంబంధించి రాజమౌళి, ప్రభాస్, రానా చెప్పిన విషయాలు కింద వీడియోలో చూడొచ్చు..