Breaking News

జర్నలిస్టుల ప్రాణాలు పోతున్నా పట్టదా..

ailurr

హెల్త్ కార్డులు లేక జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నా.. కనికరం లేని ప్రభుత్వమిది అని తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కరీంనగర్ లో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నా వంటావార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. అక్రిడిటేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినవే ఉన్నాయని.. ఇప్పటివరకు పొడగిస్తూ ఇక్కడి జర్నలిస్టులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అక్రిడిటేషన్లు సబ్ ఎడిటర్లతో సహా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెండింగ్ జర్నలిస్టుల సమస్యలపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

dharna

అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల ఆందోళనలపై స్పందించకుండా మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని జర్నలిస్టుల హక్కుల సాధించేవరకు నిద్రపోమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ధర్నాలో పాల్గొని జర్నలిస్టులకు పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు , కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు , టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ , భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *