
కరీంనగర్ జిల్లాలోని కమాన్ పూర్ మండల కేంద్రంలో వెలిసిన ఆదివరాహక్షేత్రం ఎంతో ప్రాముఖ్యం గలది.. ఇలాంటి ఆదివరహాస్వామి క్షేత్ర ఆలయాలు రాష్ట్రంలో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒక్కటి కమాన్ పూర్ మండంలో కేంద్రంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావిస్తారు.. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. తిరుమలలో ప్రథమ పూజలను ఆదివరాహస్వామి అందుకుంటున్నారు. కలియుగంలో వరాహాస్వామి లక్ష్మీదేవిని వెతుక్కూంటూ వైంకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు తిరుమలలో ప్రథమ పూజలు వరాహస్వామి అందుకున్నాడని ప్రతితీ.. తిరుమల వరాహ స్వామి తరువాత కరీంనగర్ జిల్లాలోని కమాన్ పూర్ లో ఒక బండరాయిపై ఆదివరాహస్వామి స్వామి వెలిశారు. చారిత్రకంగా ప్రసిద్ధి చెంది దైవత్వానికి ప్రత్యక్ష రూపంగా వెలిసిన స్వామి వారి దర్శనార్థం రాష్ట్రం నలుమూలల నుంచి అశేష భక్తులు వస్తున్నారు.. కాగా ఇక్కడ వరాహస్వామి విగ్రహం ఆదినుంచి ఇప్పటివరకు రెండు ఫీట్ల ఎత్తు పెరిగింది. వెంట్రుకలు, పాదాల ఆనవాళ్లు కూడా బండరాయిపై కనిపిస్తుంటాయి.
పెద్దు ఎత్తున భక్తుల రాక..
కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కరీంనగర్ తో పాటు పక్క జిల్లాల నుంచి వచ్చి స్వామి వారిని కొలుస్తారు. ఈరోజు కరీంనగర్ లోని భగత్ నగర్ నుంచి లహరి అపార్ట్ మెంట్స్ వాసులందరూ ఈ తీర్థయాత్రకు వచ్చి దర్శించుకున్నారు. అక్కడే సమీపంలో వనబోజనాలు ఆరగించారు. వీరికి వరాహస్వామి ఆలయ ఈవో మారుతి, పూజారి జగన్నాథ శర్మలు సిబ్బంది ఆలయ దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో లహరీ హైట్స్ గౌరవ అధ్యక్షులు అయిలు రమేశ్, అధ్యక్షులు రమేశ్, ప్రధాన కార్యదర్శి వేణు, కోశాధికారి కిశోర్, సాంస్కృతిక ఇన్ చార్జి మధుతోపాటు వినోద్, శేఖర్ , శ్రీనివాస్, తిరుపతితో పాటు లహరి హైట్స్ లోని కుటుంబ సభ్యులు పాల్గొని ఆదివరాహస్వామి సన్నిధిలో పూజలు చేశారు..