జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఏవీ..?

సమైక్య రాష్ట్రంలో ఎలాగు మన అధిపత్యం లేదు.. మన పనులు కాలేదు.. ఇప్పుడు అంతా మనోళ్లదే అధికారం.. కొత్త రాష్ట్రంలో ఎలాగైనా మన హక్కులు నెరవేరుతాయని ఆశించారు రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు.. కానీ రాజకీయాల్లో వారికి అన్యాయం జరుగుతోంది. వారి నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం నిరంతరంగా జరుగుతోంది..
హెల్త్ కార్డులు,  అక్రిడిటేషన్లపై ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసి ఇస్తామని ఘనంగా ప్రకటించింది. కానీ నేటికి వాటి ఊసే లేదు. జిల్లాల్లో హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు అస్సలు ఇవ్వడమే లేదు. సీనియర్లను పునరుద్ధరించుకుంటూ వస్తున్న సర్కారు కొత్తగా రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోంది..

హెల్త్ కార్డులు ఎన్నో వాయిదాలు, సమాలోచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు సీఎం ను కలిసి హెల్త్ కార్డులు ఇప్పించారు. ఇందులో బడా జర్నలిస్టులకు , చోటా జర్నలిస్టులకు ఆఖరుకు డెస్క్ లోని ఎడిషన్ ఇన్ చార్జులకు సైతం హెల్త్ కార్డులు వచ్చాయి. కానీ సబ్ ఎడిటర్లకు, కిందిస్థాయి రిపోర్టర్లకు హెల్త్ కార్డులు ఇప్పటికీ రాలేదు. కడుపునిండిన జర్నలిస్టులు ఈ విషయాన్ని మరిచిపోయారు. ఇప్పుడు దాని టాపికే తీయడం లేదు.. దీంతో సబ్ ఎడిటర్లకు అన్యాయం జరిగింది..

అక్రిడిటేషన్లలోనూ అదే అన్యాయం..
ఇటీవల కొందరు జర్నలిస్టు నాయకులు సీఎం ను కలిసి జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులపై హామీ తీసుకున్నారు. అధికారులు వెంటనే ఓ జీవో జారీ ఇస్తున్నామని ప్రకటించారు. కానీ అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో మళ్లీ జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు ఉపక్రమించాయి.

పోరుబాటకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ)

ఇటీవల నిజామాబాద్ లో జరిగిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సమావేశంలో జర్నలిస్టు సమస్యలపై చర్చించారు. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల మంజూరులో జాప్యం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని.. ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే దీనిపై హైదరాబాద్, జిల్లాలో ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటూ జాప్యం చేస్తున్న ప్రభుత్వం వైఖరిపై జర్నలిస్టులు ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *