ఆన్ లైన్ మీడియా.. ఓ నయా సంచలనం..

GNN

సమాజం మారింది.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన జీవితంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి.. అరచేతిలోనే ప్రపంచం ఆవిష్కృతమవుతోంది.. సెల్ ఫోన్ ఈ 21 శతాబ్ధపు తలరాతనే మార్చివేసింది. సెల్ ఫోన్ తోనే ఇప్పుడు సమస్తం పనులు అవుతున్నాయి. ఫోను, కరెంటు బిల్లుల నుంచి సమస్తం అరచేతిలో నిక్షిప్తం అవుతాయి.. ప్రపంచంలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో లైవ్ లో టీవీల్లో కనపడుతోంది.. మరి టీవీ కూడా చూడలేని స్థితిలో ఉన్న వాళ్లకు ఇప్పుడు ఆన్ లైన్ మీడియా అనేది మంచి సహాయకారిగా కనిపిస్తోంది.. ఆన్ లైన్ మీడియా చానల్లు, పత్రికలంటే కూడా వేగంగా ప్రజలకు అందిస్తూ విషయ సేకరణలో ముందంజలో నిలుస్తున్నాయి. ఒకప్పుడు టైం పాస్ గా నడిచిన ఆన్ లైన్ వార్తలు ఇప్పుడు అత్యవసరంగా.. ఎంతో కీలకంగా మారాయి. ఒకప్పుడు దేశంలో జరిగిన సంఘటనలు ఆ మరునాడు పేపరు చూస్తే కానీ తెలిసేవి కాదు.. నేడు చానల్స్ వచ్చాక అది కొంచెం తగ్గింది.. ఇక సెల్ ఫోన్ వచ్చాక ఆన్ లైన్ మీడియా ద్వారా క్షణాల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ లలో వార్తల సమాచారం కనిపిస్తోంది.. టెక్నాలజీ డెవలప్ మెంట్లతో 24 గంటలు నడిచే ఆన్ లైన్ చానళ్లు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరువయ్యేలా ఆన్ లైన్ మీడియా అవతరించింది. గూగుల్ కూడా రేటింగ్ పరంగా ఆన్ లైన్ సైట్లకు యాడ్స్ ద్వారా నిధులు అందజేస్తోంది. దీంతో ఈ రెవల్యూషన్ ఇంకా కొనసాగుతూ ఆన్ లైన్ మీడియా ఇప్పుడు ప్రజలకు నిత్యావసరంగా మారిపోయింది.

క్షణాల్లో వార్తలు అందిస్తున్నాం..ailu ramesh
-అయిలు రమేశ్, పొలిటికల్ ఫ్యాక్టరీ.కామ్ సీఈవో, చీఫ్ ఎడిటర్

ప్రింట్ మీడియా ను దాటి ఎలక్ట్రానిక్ మీడియా రాగానే ఇదొక స్పీడ్ యుగం అనుకున్నాం.. అప్పడిదప్పుడు వార్తలు అందించేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆన్ లైన్ మీడియా వచ్చాక.. కేవలం రోజులు కాదు గంటలు కాదు క్షణాల్లో వార్తలు చూసే పరిస్థితి జనాలు చూడగలుగుతున్నారు. ఒక సంఘటన జరిగగానే క్షణాల్లో వెబ్ సైట్లలో పెడుతున్నారు. దాన్ని జనాలు ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో షేర్ చేస్తూ జనాలు చూస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో సైతం ఆన్ లైన్ మీడియా విస్తరించింది. హైదరాబాద్ లో రెండు ఆరా ఉన్నసైట్లు ఇప్పుడు 200 పైచిలుకు వెబ్ సైట్లు , న్యూస్ పోర్టల్స్, వెబ్ చానల్స్ వచ్చి జనాలకు చేరువవుతున్నాయి.

ఆన్ లైన్ మీడియాపై జెమినీటీవీలో ప్రసారమైన కథనాన్ని పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *