90% గ్యాస్-ఆధార్ లింకేజీ పూర్తి

కరీంనగర్ : తెలంగాణా రాష్ట్రంలో వంటగ్యాస్ వాడకందార్లు, తమ ఆధార్,బాంకు, అకౌంటు వివరాలను నమోదు చేయడం లో కరీంనగర్ జిల్లాలో 90% వరకు  ప్రగతి సాధించిన సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమి బసు ను కలసి జిల్లా వంటగ్యాస్ డీలర్ల సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర యల్.పి.జి డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వి.మదన్ మోహన్,జిల్లా ముఖ్య బాధ్యులు  బొమ్మ రాధాకృష్ణ,హరిక్రష్ణ, గట్టు రాజయ్య,దీన్ దయాల్,సతీష్ కుమార్ తో కూడన బృందం ఏప్రిల్‌ నుండి నగదు బదిలీలో జరుగుతున్న ఇబ్బంది ని  వివరించింది. ఆధార్,బాంకు అకౌంట్ నమోదు డీలర్ల వద్ద వేగంగా జరిగినా వివరాల నమోదు వెరిఫికేషన్ ప్రక్రియ బాంకర్ల సెంట్రల్ సర్వర్ ద్వారా
చేయడంలో విపరీత జాప్యాన్ని ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. ప్రధాని ధన్ జన్ యోజన క్రింద తెరచిన బాంకు ఆకౌంట్లు,లావాదేవీలు లేని కారణంగా బ్లాక్ లిస్టు లోకి వెడుతున్నాయని,వీటిని పునరుజ్జీవనకు బాంకింగ్ చార్జీలను వర్తింప చేస్తున్న విషయం ఆమె ద్రుష్టికి తీసుకొని వచ్చారు.
జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రం రాజీవ్ ఇండేన్ లో పౌరసరఫరాల అధికారులు తనఖీల పేర స్టాక్ లు సరిగా వున్నప్పటికీ, 31 మార్చి వార్షిక ముగింపు, ఏప్రిల్ ఒకటో తేది సెంట్రల్ సర్వర్ పనిచేయని కారణంగా ఈ.ఓ.డి.ఎన్డ్ ఆఫ్ ది డే చేయనందున 18 ,సిలిండర్లను కంప్యూటర్ లో నమోదు చేయలేదన్నారు. దీనిని తీవ్రమైన విషయంగా భావించిన ఆధికారులు,స్టాక్ లను సీజ్ చేసి సమీప డీలర్ కు అప్పగించారన్నారు. దీని వల్ల పది రోజులుగా సిలిండర్లు లేక   ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మానవతా వాదంతో కమలాపూర్ రాజీవ్ ఇండేన్ గ్యాస్ ద్వారా యల్.పి.జి. సేవలు పునరుద్ధరణకు కృషిచేయాలని డీలర్ల సంఘం బాధ్యులు జె.సి.పౌసమి బసు ను కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *