9 నెలల గర్భిణి, 5కి.మీ పరుగు

కరీంనగర్ : ఆమె పేరు కామరపు లక్ష్మి . కరీంనగర్ నగరానికి చెందిన నిండు 9 నెలల గర్భిణి. ఏం సాహసం చేయాలనిపించిందో ఏమో కానీ పరుగుపందెంలో పాల్గొంది. ఏకంగా 5 కిలోమీటర్లు పరుగెత్తింది. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది.

laxmi

9 నెలల గర్భంతో పరుగెత్తిన మొదటి మహిళగా రికార్డుల్లోకెక్కింది. దీంతో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించింది. ఆ పరుగెత్తుతుండగా ఆమె భర్త పక్కనే ఉండడం గమనార్హం. వెటరన్ అథ్తెటిక్ అయిన భర్త రవీందర్ సహకారంతో రోజూ 5 కి.మీలు పరుగులు తీస్తుందామె.. కాన్పు సుఖ ప్రసవం కావడానికే ఇలా పరుగులు, ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టు తెలిపింది. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఆమె ఈ పరుగు పూర్తి చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *