Breaking News

8న ‘కొత్తవంతెన, జూన్-2’ పుస్తకాల పరిచయ సభ

kothavanthena-657x630

కరీంనగర్, ప్రతినిధి : తెలంగాణ రచయితల వేదిక -సాహితి సోపతి ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ గారు రచించిన ‘కొత్త వంతెన’, ‘జూన్-2’ల పుస్తకాల పరిచయ సభ ఆదివారం (ఫిబ్రవరి 8)న జరగబోతోంది. ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిలింబవన్ లో జరిగే కార్యక్రమానికి జర్నలిస్టు మిత్రులందరూ హాజరుకావాల్సిందిగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తెలంగాణ రచయితల వేదిక ప్ర.కార్యదర్శి గాజోజు నాగభూషణం గారు కోరారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లం నారాయణ, ఎడిటర్ కే.శ్రీనివాస్ గారు, ఘంటా చక్రపాణి, అన్నవరం దేవేందర్, జూకంటి జగన్నాథం, పత్తిపాక మోహన్, బూర్ల వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు. సమన్వయ కర్తగా కందుకూరి అంజయ్య వ్యవహరిస్తున్నారు. ప్రముఖులు, సాహిత్యాభిమానులు, జర్నలిస్టులందరూ హాజరుకావాల్సిందిగా కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *