779 ఖాళీల భర్తీకి సింగరేణి నోటిఫికేషన్

కొత్తగూడెం : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ నిరుద్యోగుల నెత్తిన మరోసారి పాలుపోసింది. మొన్నటిమొన్ననే 1178 ఖాలీ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ ఇప్పుడు మరోసారి 779 పోస్టుల భర్తీకి తాజాగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ పోస్టులను 80శాతం సింగరేణి ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నిరుద్యోగులకు.. మిగతా 20శాతం తెలంగాణలోని మిగితా జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించారు.

ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 10వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రూ200 లను సింగరేణి పేరు మీద డీడీ తీసి ఆన్ లైన్లో అప్లై చేసి దాంతో పాటు ధ్రువీకరణ పత్రాలతో కొత్తగూడెం ప్రధాన కార్యాలయానికి పంపాలి. ఈ అన్ని పోస్టులకు వయోపరిమితి  30 సంవత్సరాలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. రాత పరీక్ష జూలై రెండో వారంలో ఉండనుంది.

దీంతో మరో  272 ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *