
ఈనెల 7న ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, కార్యదర్శి జగదీశ్ లు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలోని కేబుల్ వినియోగదారులు ఇందుకు సహకరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న డిజిటైలేషన్ వల్ల పేచానల్ రేట్లు, టాక్స్ లు పెరిగి తమకు, వినియోగదారులకు దాదాపు 500, 600 బిల్లు వసూలు చేయాల్సి వస్తుందని.. దీనికి నిరసనగా టీవీ ప్రసారాల బంద్ తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, తమకు భారంగా ఉన్న డిజిటైలేషన్ ను రద్దు చేయాలని వారు కేంద్రాన్ని కోరారు.