Breaking News

68వ మహత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

68వ మహత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

కరీంనగర్: అహింసా పద్ధతి ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఘనత మహత్మాగాంధీ గారికే దక్కుతుందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కటకం మృత్యుంజయం గారు అన్నారు. మహత్మాగాంధి 68వ. వర్ధంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహత్ముని చిత్రపటానికి అధ్యక్షులు కటకం మృత్యుంజయం గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అహింసా పద్ధతిలో ఎన్నో సాధించవచ్చని నమ్మి, మహత్మా గాంధి గారు దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, దీంతో ప్రపంచదేశాలకు గాంధి గారు మార్గదర్శకులైనారని, స్వాతంత్ర్య పోరాటంలో మహత్మాగాంధి గారితో పాటు ఎందరో యోధులు అమరులైనారని, వారి త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని కార్కానగడ్డలో గల మహత్మాగాంధి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఎస్.సి.సెల్ అధ్యక్షులు కల్వల రాంచందర్ గారు పాల్గొని మహత్మాగాంధి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యాలయ ఇంఛార్జ్ మాదాసు శ్రీనివాస్, మూల జైపాల్, సి.హెచ్. అజిత్ రావు, రవి కుమార్, కె.సదానందచారి, పిట్టల చంద్రశేఖర్, వెన్న రాజమల్లయ్య, వేల్పుల వెంకటేష్, గడప శ్రీనివాస్, పడాల శంకరయ్య, కల్వల రాంచందర్, తాడ వీరారెడ్డి, చింతల కిషన్, సుంకరి గణపతి, తునికి బాలరాజు, యం.డి.ఖాలీక్, ముక్క భాస్కర్, జొన్నల రమేష్, యం.డి.ముజఫర్, దశరధం, జి.డి.రమేష్, ప్రశాంత్ దీపక్, దొంతి గోపి తదితరులు పాల్గొన్నారు.

Gandhi Statue

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *