66 రోజుల తర్వాత సముద్రంలోంచి బయటకు..

అమెరికా : సముద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి రెండు నెలల తరువాత ప్రాణాలతో బయటపడ్డాడు. అద్భుతం జరిగిన ఈ ఘటన అమెరికా సమీప నదీజలాల్లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి లూయిస్ జోర్డాన్ జనవరి 29న సముద్రంలోకి చేపల వేటకి వెళ్లాడు. అలా అలా తప్పిపోయిన అతడు ఒడ్డుకు 350 కి.మీకు పైగా దూరానికి కొట్టుకుపోయాడు. చివరకు అతడి కుటుంబసభ్యులు చనిపోయాడని నిర్దారించుకున్నారు.

కాగా అటుగా వెళ్లిన ఒక జర్మనీ నౌక దెబ్బతిన్న పడవలో ఉన్న ఈ వ్యక్తి గుర్తించి రక్షించింది. అనంతరం అమెరికా అధికారులకు సమాచార మిచ్చారు. వారు వచ్చి బాధితుడిని హెలిక్యాప్టర్ ద్వారా అమెరికాకు తరలించారు. కాగా ఈ రెండు నెలలు అతడు చేపలు పట్టుకుంటూ వాటిని తిని జీవించాడు. వర్షం పడ్డప్పుడు ఆ నీటిని పట్టుకొని తాగాడట.. ఇంతటి విపత్కర పరిస్థితులను తట్టుకొని ప్రాణాలతో బతికి బయటపడ్డ లూయిస్ కుటుంబ సభ్యులను చేరి ఈ సంఘటనలు వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *