Breaking News

60 శాతం పూర్తి చేసుకున్న హీరో శ్రీకాంత్ కొత్త చిత్రం

srikanth new movie

ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌ హీరోగా కరణం బాబ్జీ (శ్రీను ) దర్శకత్వంలో రూపోందుతున్న కొత్త సినిమా విజయవాడ లోని ఇంద్రకీలాద్రీ , బస్టాండ్ , జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అనగాని ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఎ.వి వి దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈమూవీ ఇటీవలే ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైంది. శ్రీకాంత్ , అక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. చండీ సినిమాకు రచయితగా పనిచేసిన బాజ్జీ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా నాకే కాదు, సినిమా టీమ్ మొత్తానికి బ్రేక్ ను ఇస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నానని ..ఈ పాత్ర నాకు ఎంతో నచ్చిందని అన్నారు..
దర్శకుడు కరణం బాబ్జీ (శ్రీను ) మాట్లాడుతూ..చండీ సినిమాకు రచయితగా పనిచేశానని, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌవుతున్నానని తెలిపారు. శ్రీకాంత్ గారికి ఖడ్గం , అపరేషన్ దుర్యోదన చిత్రాలు ఎంతో పేరును తెచ్చిపెట్టాయో, ఈ చిత్రం కూడా అంతకంటే ఎక్కువ పేరును తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు.. విజయవాడలోనే 90 శాతం షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *