6 సెకన్లలో 40వేల ఫోన్లు అమ్ముడయ్యాయి!

జియోమి మొబైల్ కంపెనీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మొబైల్ సేల్స్ లో కొత్త రికార్డ్ సాధించింది. 4 జీ రెడ్మీ స్మార్ట్ ఫోన్లు సేల్స్ లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిపింది చైనాకు చెందిన ఈ కంపెనీ. 6 సెకన్లలో 40 వేల ఫోన్లను అమ్మేసింది జియోమి. ఫ్లిప్ కార్ట్ లో పెట్టిన 6 సెకన్లలో స్టాక్ అయిపోయిందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ను 9 వేల 9 వందల 99 రూపాయలకు అందిస్తోంది.  జనవరి 6న కంపెనీ మరోసారి ఈ రెడ్మీ స్మార్ట్ ఫోన్లను అమ్ముతామని జియోమి ఇండియా హెడ్ మను కుమార్ చెప్పారు. ఫ్లిప్ కార్ట్ తో పాటు ఇండియాలోని 6 సిటీల్లోని ఎయిర్ టెల్ స్టోర్స్ లో ఈ 4 జీ రెడ్మీ స్మార్ట్ ఫోన్లను అమ్ముతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

4జీ రెడ్మీ స్మార్ట్ ఫోన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సింగిల్ సిమ్ తో ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 5.5 ఇంచ్ డిస్ప్లే ఉండే ఈ ఫోన్లో బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సల్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.