
-వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్
ప్రపంచకప్ లో భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసిన ఏకైక జట్టుగా రికార్డు నమోదు చేసింది. గ్రూప్ బిలో ఉన్న భారత్ మొదట పాకిస్తాన్, ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఏఈ, ఐర్లాండ్, ఈరోజు జింబాబ్వేను అలౌట్ చేసి ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు అందుకోని ఘనతను సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మన బౌలర్లు తేలిపోయారు. ధారళంగా పరుగులిచ్చారు. కనీసం జట్టునైనా ఆలౌట్ చేయలేదు. అదే బౌలర్లు ప్రపంచకప్ లో దుమ్ము దులుపుతున్నారు. ఇఫ్పటివరకు ఆడిన అన్ని జట్లను అలౌట్ చేశారు.
కాగా శనివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఇండియా నిలకడగా బ్యాంటింగ్ చేస్తోంది. అంతకుముందు బ్యాంటింగ్ చేసిన జింబాబ్వే కెప్టెన్ టేలర్ సెంచరీ చేయడంతో భారీ స్కోరు సాధించింది. 48.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్యసాధనకు దిగిన ఇండియా త్వరగానే ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం 21 ఓవర్లలో 84/3 వికెట్లతో ఆడుతోంది.