6న వస్తున్న ‘పంబలకిడి జంబ’

హైదరాబాద్ : ప్రేమను ప్రేమతోనే జయించాలనే అంశంతో ‘పంబలకిడి జంబ’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాబ్జీ, అశోక్, అనూస జంటలుగా నటించారు. గొర్రెపాటి శివరామ్ దర్శకత్వం వహించారు. రాజా ఫిలింస్ పతకాంపై యు. ఎన్. రాజ్ నిర్మించారు. కాగా దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత యు.ఎన్. రాజ్ తెలిపారు.
నవంబర్ 6 నుంచి 11లోపు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ప్రతీ ఆటకు ఒకరిని లక్కీడీప్ ద్వారా ఎంపిక చేసి దీపావళి గిప్ట్ ప్యాక్ అందజేస్తామని చెప్పారు. అలాగే ప్రతి థియేటర్ నుంచి లక్కీడిప్ ద్వారా ఒకరికి నూతన రాజధాని అమరావతికి సమీపంలో వేసిన వెంచర్ లో 50 చ.గ ప్లాట్ ను అందజేస్తామని ఆయన తెలిపారు.

pambapamba1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *