
‘ఒక్కో దర్శకుడూ 125 నుంచి 150 రోజులు సినిమాకు తీసుకుంటున్న రోజులివి. అలాంటిది రెండో ప్రపంచ యుద్ధం నేపత్యంలో రూపొందిన కంచెను కేవలం 55 రోజుల్లో తీశారంటే నమ్మలేకపోతున్నారు.. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కంచె లాంటి సినిమా ఓ గర్వకారణం.. పల్లె టూరి వాతావరణం,ప్రేమకథ ఎంతో సహజంగా ఉంది.. రెండో ప్రపంచ యుద్ధాన్ని హాలీవుడ్ స్థాయిలో చూపించారు. దర్శకుడి ప్రతిభకు ఇది గీటురాయి..’ అన్నారు చిరంజీవి
కంచె సినిమా చూసిన చిరంజీవి ఈ సందర్బంగా చిత్రం బృందంతో ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుణ్ తేజ్, చిత్ర దర్శకుడు క్రిష్, నాగబాబు, సాయిమాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు కులాలు, మనస్పర్థలపై ఎంతో తాత్వికంగా సంభాషణలు రాసిన సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషనలు ఎంతో బాగున్నాయన్నారు చిరంజీవి.