500 ధియేటర్లలో ఏఫ్రిల్ 25న శింబు భారీ చిత్రం ‘తిమ్మిరి’

‘మన్మధ’,‘వల్లభ’వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కధానాయకుడు శింబు ఇప్పుడు ‘తిమ్మిరి’చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని
అలరించబోతున్నాడు. బాలా జీ రియల్ మీడియా ప్త్ర్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రమేష్ తాండ్ర, గ్రిహీత్ తాండ్ర నిర్మించిన ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బంగారం’చిత్ర
దర్శకుడు ఎస్. ధరణి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి నిర్మాత రమేష్ తాండ్ర మాట్లాడుతూ- ‘‘శింబు హీరోగా నటించిన మరో సూపర్ హిట్ మూవీ ఇది.
‘మిరపకాయ్’హీరోయిన్ రిచ గంగోపాధ్యాయ శింబు సరసన నాయికగా నటించింది. అరుంధతి, దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో విలన్ గా నటించిన సోనూసూద్
ఇతరులు మెయిన్ విలన్ గా నటించిన ప్రముఖ నటుడు నాజర్ మరో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు ధమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు.
అన్ని పాటల్ని భాగ్యలక్ష్మి రాశారు. మ్యూజికల్ గా గత శింబు చిత్రాల్లాగే పెద్ద హిట్ అయింది. ఏఫ్రిల్ 25న 500 ధియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా రిలీజ్
చేయడానికి సన్నాహలు చేస్తున్నామన్నారు. ఈ హట్ సమ్మర్ లో అందరూ ఎంజాయ్ చేసే మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఈ ‘తిమ్మిరి’అన్నారు. ఈ చిత్రానికి పాటలు:
భాగ్యలక్ష్మి, సంగీతం: ధమన్ యస్.యస్, నిర్మాతలు: రమేష్ తాండ్ర, గ్రిహీత్ తాండ్ర, దర్శకత్వం: ఎస్. ధరణి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *