
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) తెలంగాణలోని నిరుద్యోగుల కోసం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది పలుకుతోంది.. సొంతంగా ఒక 50వేల ప్రశ్నల డేటా బ్యాంకును తయారుచేసి వెబ్ సైట్ లో పెట్టాలని యోచిస్తుందట..
అందరూ కష్టంగా భావించే జనరల్ స్టడీస్ లో ఉండే భారత, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం-సంస్కృతి, ఆర్థికాంశాలు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితరాలపై ఈ ప్రశ్నలు ఉంటాయి.. అయితే అభ్యర్థుల ఉపయోగార్థం తయారు చేస్తున్న వీటిపై లోతుగా అధ్యయనం చేసి నిపుణులతో కమిటీ వేసి రూపొందించాలని నిర్ణయించారు. ఎప్పుడు, ఎంత కాలం అనేది కచ్చితంగా చెప్పలేమని టీఎస్పీఎస్సీ చెబుతోంది..