Breaking News

5 లక్షల మెజార్టీతో గెలుస్తాం..

0000023333

వరంగల్ : వరంగల్ ఎన్నికలు కేసీఆర్ పతనానికి నాంది అని, కాంగ్రెస్ అభ్యర్థిగా  తాను 5 లక్షల మెజార్టీతో విజయకేతనం ఎగురవేస్తానని  అన్నారు కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ. హన్మకొండలోని డీసీసీ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉద్యమించారని..సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ సాధించుకున్నారని సర్వే అన్నారు. సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలు కోల్పోతున్నామని తెలిసినా కూడా దేశంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నా కూడా సోనియాగాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఈ రాష్ట్ర దేవతగా మారారని అన్నారు.అలాంటి సోనియాకు వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ మాయమటలు నమ్మి జనం ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారని.. కానీ గద్దెనెక్కిన తర్వాత కేసీఆర్ నిజం స్వరూపం వెల్లడై ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు.  కేసీఆర్ ఎన్నికల ముందు 100 హామీలిచ్చారని..  ఒక్కటైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు.

ఉద్యమాలు చేసిన విద్యార్థి, ఉద్యోగులకు మొండి చేయి చూపారని.. ఇప్పటివరకు ఒక నియామకం జరపలేదని సర్వే మండిపడ్డారు. కేసీఆర్ ఇంట మాత్రం అందరికీ పదవులు లభించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో  ఏఐసీసీ ప్రధాన  కార్యదర్శి కుంతియా, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, వరంగల్ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మన్ గౌడ్, వరంగల్ నగర అద్యక్షులు తాటిశెట్టి విద్యాసాగర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండి నర్సాగౌడ్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *