
విజయవాడలోని ఓ స్కూలులో ఐదోతరగతి చదివే విద్యార్థి తన పుట్టిన రోజు సందర్భంగా 5 లక్షల విలువ చేసే నగలు పెట్టుకొని స్కూలుకు వచ్చింది. ఇది గమనించిన ఓ దొంగ ఆమె వెంటే అనుసరించాడు.
సౌమ్య ప్రణవి అనే విద్యార్థినిని భారీ నగలు వేసుకొని స్కూలు వద్ద దిగింది. ఆమె తండ్రి స్కూలు గేటు వద్ద దింపి వెళ్లిపోయాడు. ఇది గమనించిన ఓ దొంగ ఆమెతో పాటు స్కూలులోకి వెల్లి .. ఆమెతో నగలతో క్లాసులకు ప్రిన్సిపాల్ వెళ్లనివ్వడని.. ఆ నగలు ప్రిన్సిపాల్ రూంలో పెడతా అని తీసుకొని ప్రిన్సిపాల్ గదిలోకి వెల్లాడు. అనంతరం బాలికతో మీ నాన్నకు ఇవి ఇచ్చి వస్తానని చెప్పి పరారయ్యాడు. ఇదంతా స్కూలులోని సీసీ టీవీలో రికార్డు అయ్యింది.. దీంతో అవాక్కయిన బాలిక ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విషయం తెలపడంతో పోలీసుకు కేసు నమోదైంది. అన్ని నగలు అంత భద్రత లేకుండా వస్తే దొంగలు ఎత్తుకుపోరా అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను పైన చూడొచ్చు..