5 నిమిషాల్లో 60వేల కిట్ల మ్యాగీ అమ్మకాలు

maggi unboxing_0_0_0_0_0_0

హానికర పదార్థాలున్నాయని నిషేధానికి గురైన మ్యాగీ ఆ తదుపరి కోర్టు ఉత్తర్వులతో మళ్లీ అమ్మకాల బాటపట్టింది. పునరాగమనంను ఘనంగా చాటింది.  ఇ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ తో జట్టుకట్టిన మ్యాగి దీపావళి సందర్భంగా విక్రయాలను ఆన్ లైన్ లో ప్రారంభించింది.  అమ్మకాలు ప్రారంభం కాగానే కేవలం 5 నిమిషాల్లో  60000కిట్లు అమ్ముడుపోవడం విశేషం.

మ్యాగి కిట్ల కోసం 9 వరకు ముందస్తు నమోదును సంస్థ ప్రారంభించింది. మ్యాగి కిట్లలో  వినియోగదారులను ఆకట్టుకునేందు కోసం 12 మ్యాగి ప్యాకెట్లు,2016 మ్యాగి క్యాలెండర్, మ్యాగి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, మ్యాగి పోస్ట్ కార్డులు, వెల్ కం బ్యాక్ ఉత్తరాలు పొందుపరిచారు. దీంతో అమ్మకాలు హోరెత్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *