
తమిళ సెలబ్రెటీలు భారీగా పన్ను ఎగ్గొట్టడంతోనే వారి ఇళ్లపై దాడులు చేశారని సమాచారం. హీరో విజయ్, సమంత, ననతాలు ముగ్గురు కలిసి దాదాపు రూ.25 కోట్ల వరకు పన్నులు ఎగ్గొట్టారట.. ఈ దాడుల్లో ఐటీ అధికారులు రూ.4 కోట్ల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారట.. వీరంతా ట్యాక్స్ చెల్లించనందుకే దాడులు చేసినట్టు సమాచారం.
విజయ్ అయిదేళ్లుగా, సమంత, నయనతార రెండేళ్లుగా పన్నులు కట్టుట లేదు.. నిర్మాతలు, ఫైనాన్షియర్ సహా10 మంది ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు, సోదాలు చేశారు. ఇందులో చాలా మంది పన్నుల కట్టలేదు. అందుకే సినిమా విడుదల వేళ అధికారులు ఈ దాడులు చేశారు.