5 ఎమ్మెల్సీ స్థానాలపై టీఆర్ఎస్ గురి

MLC

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి నోటీఫికేషన్ జారీ కానుండడంతో బలాబలాలపై సమీకరణాలు వేసుకుంటున్నాయి పార్టీలు.. దీంతో రాజకీయం వేడెక్కింది. శాసనసభలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి టీఆర్ఎస్ కు నాలుగు, సమీకరణాలు కలిసి వస్తే మరోస్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఒక స్థానంలో అభ్యర్థి విజయం సాధించే అవకాశముంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన సీట్లలో జంపింగ్ లతో టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీల బలాబలాలు మారాయి. దీంతో టీఆర్ఎస్ కు ఎక్కవ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ కు ఉన్న 63 స్థానాల ఎమ్మెల్యేలకు 4 ఎమ్మెల్సీ స్థానాలు గ్యారెంటీగా వస్తాయి. ఇక కాంగ్రెస్ బలంకు ఒక స్థానం వస్తుంది. ఇక టీడీపీతో బీజేపీ, సీపీఐ, సీపీఎం, కలిస్తే ఒక స్థానం గెలిచే అవకాశం ఉంది. కానీ టీడీపీకి సీపీఐ, సీపీఎం కలిసివస్తాయా అన్నది ప్రశ్న. వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతిస్తే 4 తో పాటు 5 వ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ కే దక్కుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *