
దుబాయ్ లో అడుక్కోవడం నేరం.. అక్కడ అడుక్కున్నట్టు కనపడ్డారో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. చట్టాలు ఎంతో కఠినంగా ఉండే ఈ గల్ఫ్ దేశంలో కొందరు విదేశాల నుంచి వచ్చి మసీదులు, వీధుల్లో దొంగతనంగా యాచకవృత్తి చేపట్టారట.. దీంతో దీన్ని కనుక్కునేందుకు దుబాయ్ లోని మున్సిపల్ అధికారులు ఇటీవల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు..
ఇందులో ఒక యాచకుడి వద్ద దాదాపు 270000దీనార్లు బయటపడ్డాయట.. అంటే మన కరెన్సీలో దాదాపు 48 లక్షల రూపాయలన్నమాట.. ఇంత భారీ మొత్తం అదీ ఓ బిచ్చగాడి వద్ద లభించడంతో అధికారులు విస్తుపోయారట. అక్కడ రోజుకు బిచ్చగాల్లు అడుక్కే సంపాదన దాదాపు 9000 దినార్లు ఉంటుందట.. అంత భారీగా వస్తుంది కాబట్టే బిచ్చగాళ్ల వృత్తిని అక్కడో ఓ ప్రొఫెషన్ గా కొందరు కొనసాగిస్తున్నారట.. బాగుంది కదా అడుక్కోవడం..