40కోట్లు కొల్లగొట్టిన జంగిల్ బుక్

కార్టూన్ యానిమేషన్ చిత్రం జంగిల్ బుక్ విడుదలై దేశంలో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.  ఈసినిమా విడుదలై వారం కాకముందే దాదాపు దేశంలోని 1700 పైగా థియేటర్లలో దాదాపు 40కోట్లకు పైగా మొత్తాన్ని తయారు చేసి సంచలనం సృష్టించింది. అడవి జంతువుల మధ్య పెరిగిన మౌగ్లీ చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ప్రముఖ హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీ సంస్థ ఈ సినిమాను వారం ముందుగానే భారత దేశంలో విడుదల చేసింది.

ఈ శుక్రవారం వారం లేట్ గా ఈ సినిమాను అమెరికాలో విడుదల చేస్తోంది వాల్ట్ డిస్సీ సంస్థ. ఇక్కడ ఘనవిజయం సాధించడంతో సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది సంస్థ. అమెరికా మార్కెట్ పెద్దది కావడంతో ఇంకా భారీగా సినిమా వసూలు చేయనుంది.

కాగా వాల్ట్ డిస్సీ సంస్థ ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో దీనికి సీక్వెల్ రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ చిత్ర రచయిత జస్టిన్ మార్క్స్ తో రెండో భాగం తీయడానికి కథ కోసం సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *