4 పైసల వడ్డీకే ముథూట్ రుణం

అవసరానికి డబ్బు అవసరం పడితే వడ్డీ వ్యాపారుల వద్దకు పీల్చి పిప్పి చేస్తున్నారు. అత్యవసరానికి 10 రూపాయల వడ్డీ, లేదంటే రూ.5 వడ్డీ అప్పు ఇచ్చిన మొత్తంపై వసూలు చేస్తున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్న ఈ తరుణంలో అందరూ బంగారంపై రుణాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు.

ఇప్పుడు బంగారు కుదువ పెట్టుకొని అప్పులిచ్చే ముథూట్ ఫైనాన్స్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.  ఎక్స్ ప్రెస్ గోల్డ్ లోన్ కింద బంగారంపై కేవలం 4 పైసల వడ్డీతో అప్పు ఇస్తామని ప్రకటన ఇచ్చింది.  సరళమైన తిరిగి చెల్లింపు సౌకర్యం కల్పించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం 3800 శాఖలతో విస్తరించిన మూథూట్ ఫైనాన్స్ జన అవసరాలకనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *